పల్నాడు జిల్లా నూతన *ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్* గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో *లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)* సేవలను వినియోగించుకోవాలి.🔹 LHMS యాప్‌లో నమోదు చేసుకున్న వెంటనే, మీ ఇంటి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది పరిశీలించి, మీ ఇంటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు.🔹 మీ ఇంటికి పోలీస్ సిబ్బంది వచ్చి వైర్‌లెస్ మోషన్ సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి, మీ ఇంటి పరిసరాలను నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు చేపడతారు.🔹 LHMS యాప్‌లో *మీ ఇంటి వివరాలు, చిరునామా, సెల్ నంబర్* తదితర వివరాలను నమోదు చేసి పోలీసులకు తెలియజేయవచ్చు.🔹 ఇంటిని ఖాళీ చేసి వెళ్లే ముందు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. 🔹 ప్రజలు LHMS AP Police యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని తమ ఇళ్ల భద్రత కోసం పోలీసుల సేవలను వినియోగించుకోవాలి.*మీ ఇంటి భద్రత… మా బాధ్యత*పల్నాడు జిల్లా పోలీస్


