వార్త ముఖ్యాంశాలు
- ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి ఘన సన్మానంఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం ఆత్మకూరు, నవంబర్ 15 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు సోమా వెంకటసుబ్బయ్యకు జాతీయ స్థాయి పురస్కారం…
- ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోట మండలం విద్యానగర్లో నిర్వహించిన జర్నలిస్టుల జాతీయ పురస్కారాల కార్యక్రమంలో ఆయనను ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.
- లీలా మోహనకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్యకు జాతీయ గౌరవ పురస్కారాన్ని అందజేశారు.
ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి ఘన సన్మానం
ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం
ఆత్మకూరు, నవంబర్ 15 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు సోమా వెంకటసుబ్బయ్యకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోట మండలం విద్యానగర్లో నిర్వహించిన జర్నలిస్టుల జాతీయ పురస్కారాల కార్యక్రమంలో ఆయనను ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం. లీలా మోహనకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్యకు జాతీయ గౌరవ పురస్కారాన్ని అందజేశారు. జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం. లీలా మోహనకృష్ణ మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య, ఎన్బీకేఆర్ కళాశాల డైరెక్టర్ విజయకుమార్, ప్రముఖ విద్యాసంస్థల డైరెక్టర్ ఉషారాణి, సినీ, జబర్దస్త్ కళాకారులు నవ్వుల మాస్టర్ దామోదర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.తన సేవలను గుర్తించి జాతీయ గౌరవ పురస్కారాన్ని అందజేసిన ఎంవీ రావు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం. లీలా మోహనకృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మికి సోమా వెంకటసుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యాసంస్థల నిర్వాహకులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
