నెల్లూరు రూరల్ పరిధిలో అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాదరాజుగూడూరు గ్రామానికి చెందిన మాగంటి వైష్ణవిసాయికి అనంతసాగరం మండలం పీకే పాడు గ్రామానికి చెందిన ముమ్మడి వెంకటశేషారెడ్డితో 2024లో వివాహమైంది. కొంతకాలం దాంపత్య జీవితం సజావుగా సాగిన అనంతరం అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని వైష్ణవిసాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు.

అదనపు కట్నం కోసం వేధింపులు.. భర్త, అత్తమామలపై కేసు