Friday, 25 September 2026
  • Home  
  • ఓజిలి మండలంలో ‘మామూళ్ల’ సర్వే.*
- తిరుపతి

ఓజిలి మండలంలో ‘మామూళ్ల’ సర్వే.*

*డబ్బులిస్తేనే రిపోర్ట్.. లేదంటే ఫైల్ క్లోజ్!* *ఓజిలి, సెప్టెంబర్ 25, ప్రత్యేక కధనం:* *తిరుపతి జిల్లా ఓజిలి మండల రెవెన్యూ విభాగంలో అక్రమార్కుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. భూములను కొలవాల్సిన ప్రభుత్వ సర్వేయర్లు “డబ్బులు ఇస్తేనే పని.. లేదంటే నో సర్వే” అంటూ బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారా?* *నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న క్రమపద్ధతిని పక్కనబెట్టి, ఎవరైతే చేతులు తడుపుతారో వారికే ప్రాధాన్యత ఇస్తూ అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా?* *మండల సర్వేయర్ కనుసన్నల్లోనే అంతా?* *మండల సర్వేయర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, అతని కనుసన్నల్లోనే సచివాలయ సర్వే సిబ్బంది కూడా ఇదే అడ్డగోలు పద్ధతిని అవలంబిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ, సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ముందుకొచ్చినోడికి మొండిచేయి.. వెనకొచ్చినోడికి వెంటనే సర్వే! అన్నట్లుగా ఓజిలి మండలంలో సర్వే ప్రక్రియ అంతా ‘మామూళ్ల’ చుట్టూనే తిరుగుతోంది.* *నెలల తరబడి వేచి చూస్తూ, ఎలాంటి ముడుపులు ఇవ్వని ముందస్తు దరఖాస్తుదారులకు మండలంలో మొండిచేయి ఎదురవుతోంది. వారి ఫైళ్లను అటకెక్కించి రకరకాల సాకులు చెబుతున్నారని బాధితులే బహిర్గతం కావడం గమనార్హం. అడిగినంత ‘మామూలు’ చెల్లిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగిపోతున్నారని, సర్వే పూర్తి చేయడమే కాకుండా, క్షణాల్లో సర్వే రిపోర్టును దరఖాస్తుదారుల చేతిలో పెడుతున్నారని చెబుతున్నారు.* *ఉన్నతాధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందా?* *ఈ అక్రమ వసూళ్ల పర్వంపై స్థానిక రైతులు, భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓజిలి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న ఈ దందాపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గత నాలుగు నెలల నుండి రోజువారి ఎంతమంది సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ యే రిజిస్టర్ లో నమోదు చేశారు, సర్వే రిపోర్టు ఎప్పుడు అందించారు అనే విషయాలపై రికార్డులు పరమైన విచారణ జరపాలని, అవినీతికి పాల్పడుతున్న సర్వే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉన్నతాధికారులను కూడా దీనిలో అనుమానించాల్సి వస్తుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.* *వరుస ప్రత్యేక కథనాలతో ఓజిలి మండల సర్వే మామూళ్ల సమాచారం త్వరలో…*

*డబ్బులిస్తేనే రిపోర్ట్.. లేదంటే ఫైల్ క్లోజ్!*
*ఓజిలి, సెప్టెంబర్ 25, ప్రత్యేక కధనం:*

*తిరుపతి జిల్లా ఓజిలి మండల రెవెన్యూ విభాగంలో అక్రమార్కుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. భూములను కొలవాల్సిన ప్రభుత్వ సర్వేయర్లు “డబ్బులు ఇస్తేనే పని.. లేదంటే నో సర్వే” అంటూ బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారా?*

*నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న క్రమపద్ధతిని పక్కనబెట్టి, ఎవరైతే చేతులు తడుపుతారో వారికే ప్రాధాన్యత ఇస్తూ అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా?*

*మండల సర్వేయర్ కనుసన్నల్లోనే అంతా?*

*మండల సర్వేయర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, అతని కనుసన్నల్లోనే సచివాలయ సర్వే సిబ్బంది కూడా ఇదే అడ్డగోలు పద్ధతిని అవలంబిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ, సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ముందుకొచ్చినోడికి మొండిచేయి.. వెనకొచ్చినోడికి వెంటనే సర్వే! అన్నట్లుగా ఓజిలి మండలంలో సర్వే ప్రక్రియ అంతా ‘మామూళ్ల’ చుట్టూనే తిరుగుతోంది.*

*నెలల తరబడి వేచి చూస్తూ, ఎలాంటి ముడుపులు ఇవ్వని ముందస్తు దరఖాస్తుదారులకు మండలంలో మొండిచేయి ఎదురవుతోంది. వారి ఫైళ్లను అటకెక్కించి రకరకాల సాకులు చెబుతున్నారని బాధితులే బహిర్గతం కావడం గమనార్హం. అడిగినంత ‘మామూలు’ చెల్లిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగిపోతున్నారని, సర్వే పూర్తి చేయడమే కాకుండా, క్షణాల్లో సర్వే రిపోర్టును దరఖాస్తుదారుల చేతిలో పెడుతున్నారని చెబుతున్నారు.*

*ఉన్నతాధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందా?*

*ఈ అక్రమ వసూళ్ల పర్వంపై స్థానిక రైతులు, భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓజిలి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న ఈ దందాపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గత నాలుగు నెలల నుండి రోజువారి ఎంతమంది సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ యే రిజిస్టర్ లో నమోదు చేశారు, సర్వే రిపోర్టు ఎప్పుడు అందించారు అనే విషయాలపై రికార్డులు పరమైన విచారణ జరపాలని, అవినీతికి పాల్పడుతున్న సర్వే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉన్నతాధికారులను కూడా దీనిలో అనుమానించాల్సి వస్తుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.*

*వరుస ప్రత్యేక కథనాలతో ఓజిలి మండల సర్వే మామూళ్ల సమాచారం త్వరలో…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.