Tuesday, 22 September 2026
  • Home  
  • సరస్వతి పూజతో విద్యార్థుల సందడి.. శాంతియుతంగా వినాయక నిమజ్జనం
- అనకాపల్లి

సరస్వతి పూజతో విద్యార్థుల సందడి.. శాంతియుతంగా వినాయక నిమజ్జనం

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ఎలమంచిలి ఏటికొప్పాక గ్రామంలోని శివాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సరస్వతి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, జ్ఞానం, మంచి భవిష్యత్తు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తితో నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు, గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొనగా వినాయక నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా ముగిసింది. సరస్వతి పూజ, వినాయక నిమజ్జనంతో శివాలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ఎలమంచిలి

ఏటికొప్పాక గ్రామంలోని శివాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సరస్వతి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, జ్ఞానం, మంచి భవిష్యత్తు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తితో నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు, గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొనగా వినాయక నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా ముగిసింది. సరస్వతి పూజ, వినాయక నిమజ్జనంతో శివాలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.