ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 10 (పున్నమి ప్రతినిధి)
డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు చేపట్టిన ర్యాలీని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్ద కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. సోమిరెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాకాని పూజితమ్మతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ కాకాని విమర్శ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 10 (పున్నమి ప్రతినిధి) డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఏపీ జెన్ జెడ్ వార్ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు చేపట్టిన ర్యాలీని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్ద కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. సోమిరెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాకాని పూజితమ్మతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

