నంద్యాల: నియోజకవర్గల సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సూచనలు, స్థానిక అవసరాలు, ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.తలసరి ఆదాయం, జిల్లా ఉత్పత్తి పెంపునకు వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక వనరుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రాధాన్యతా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

నియోజకవర్గాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు: జిల్లా కలెక్టర్