భట్టిప్రోలు సీతారామయ్య గారికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి నివాళి.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 16/09/2026.
జి.కొండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జి.కొండూరు మండల నాయీ బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు, టీడీపీ 132వ బూత్ ఇంచార్జి, జి.కొండూరు మండల నాయీ బ్రాహ్మణ సంఘం మండల శాఖ అధ్యక్షులు భట్టిప్రోలు నాగేంద్ర గారి తండ్రి భట్టిప్రోలు సీతారామయ్య (66) గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన సీతారామయ్య గారి సంస్మరణ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు హాజరయ్యారు. సీతారామయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం భట్టిప్రోలు నాగేంద్ర గారితో పాటు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పరామర్శించారు. సీతారామయ్య గారి మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



