రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.FollowShareఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రిఫైనరీ సమీపంలో పెట్రో కెమికల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సీఎండీ సంజయ్ ఖన్నా సమావేశమయ్యారు. ప్రకాశం- నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజె క్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని ఈ సందర్భంగా సంజయ్ ఖన్నా తెలిపారు.ఏపీలో రూ. 1.45 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ… ఈ నెలలోనే పర్యావరణ అనుమతులుఏడాదికి 9 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి సెప్టెంబరు చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన అధ్యయన నివేదిక వచ్చిన వెంటనే ఈ ఏడాది అక్టోబరు నెలలోనే తుది పెట్టుబడి వ్యయం ఖరారు అవుతుందని వివరించారు. ఆ తదుపరి రిఫైనరీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.


