హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన సమావేశం కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ మండలం పగడాల పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అపోహలు, హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ,మండల స్థాయి ఇంప్లిమెంటరు కే శివ శంకర్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మి,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన