Thursday, 17 September 2026
  • Home  
  • పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్

గూడూరు సెప్టెంబర్ 16: స్థానిక ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాంప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షణతో పాటు పర్యావరణాన్ని, భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, గ్రీన్హౌస్ ప్రభావం వంటి సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాముఖ్యత, ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు, ఓజోన్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని, దాని పరిరక్షణకు విద్యార్థులు మరియు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, సీనియర్ అధ్యాపకులు, రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు శ్రీమతి కృపాకరుణవాణి, శ్రీమతి శైలజ, డాక్టర్ ఏ.వి. ప్రసాద్ తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు సెప్టెంబర్ 16:
స్థానిక ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాంప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షణతో పాటు పర్యావరణాన్ని, భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, గ్రీన్హౌస్ ప్రభావం వంటి సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాముఖ్యత, ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు, ఓజోన్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని, దాని పరిరక్షణకు విద్యార్థులు మరియు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, సీనియర్ అధ్యాపకులు, రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు శ్రీమతి కృపాకరుణవాణి, శ్రీమతి శైలజ, డాక్టర్ ఏ.వి. ప్రసాద్ తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.