అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ రాజుపాక గిరిజన రైతుల చిరకాల స్వప్నం సాకారమవు తూ,సాగు భూములకు హక్కు పత్రాలు లభించాయి. గ్రామంలో గిరిజన రైతులకు అటవీ హక్కుల మూడో విడత రీ-సర్వే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
గ్రామానికి చెందిన 39 మంది అర్హులైన రైతులకు భూ హక్కు పత్రాలను అధికారులు,ప్రజాప్రతినిధులు జడ్పీటీసీగంగరాజు ఎంపీటీసి నీలవేణి చేతుల మీదుగా అందజేశారు.ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు అధికారికంగా పట్టాలు రావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై తమ భూములకు భద్రత లభించడంతో పాటు, ప్రభుత్వ ఫలాలు కూడా నేరుగా అందుతాయని రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో అనంతగిరి (వి ఆర్ ఓ )దేముడు బాబు, లింగమూర్తి, జడ్పీటీసీ దీసరి గంగరాజు,స్థానిక ఎంపీటీసీ శెట్టినీలవేణి ,కూటమి నాయకులు పార్లమెంట్ అధ్యక్షులు పాంగి రవీంద్ర వార్డు మెంబెర్ జన్ని సుబ్బారావు, జన్ని గంగరాజు, పిసా కార్యదర్శి అప్పారావు,చందు, దీసరి బుద్దురాజు, చిన్న గంగులు తో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



