Sunday, 17 May 2026
  • Home  
  • ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ
- గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ

పున్నమి ప్రతినిధి@ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి సమాజంలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలియజేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఉక్కు మనిషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రగతి పథo వైపు పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, శ్రీధర్ శర్మ, మైమూన్, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి@ గూడూరు
స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి సమాజంలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలియజేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఉక్కు మనిషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రగతి పథo వైపు పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, శ్రీధర్ శర్మ, మైమూన్, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.