భూపాలపల్లి: తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బుర్ర కొమురయ్య మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భాష, యాస, సంస్కృతి, సామాజిక సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని అన్నారు. ప్రజల పక్షాన నిలిచి, తన కలం ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన కాళోజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాళోజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు.

ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
భూపాలపల్లి: తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్ర కొమురయ్య మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భాష, యాస, సంస్కృతి, సామాజిక సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని అన్నారు. ప్రజల పక్షాన నిలిచి, తన కలం ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన కాళోజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాళోజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు.

