నర్సంపేట నియోజకవర్గం లో విస్డం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో, ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యార్థులకు శ్రీకృష్ణుడి జన్మ విశిష్టత, ఆయన బోధనలు, ధర్మం–న్యాయం పట్ల ఆయన చూపిన మార్గాన్ని ఉపాధ్యాయులు వివరించారు. సంప్రదాయ పండుగల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడంతో పాటు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జహంగీర్. డైరెక్టర్ జావిద్ మరియు స్కూల్ మేడం పాల్గొని విజయవంతం చేశారు.



