Friday, 4 September 2026
  • Home  
  • ఎస్వీ పురంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

ఎస్వీ పురంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని రేణిగుంట మండలం ఎస్వీ పురంలో ఇచ్చిన మాట నెరవేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రెండు నెలల క్రితం గ్రామంలోని తాగునీటి సమస్యపై గ్రామస్థులు విన్నవించగా, వెంటనే స్పందించి వేయించిన బోరు పనులు పూర్తయి ఈరోజు ప్రజా వినియోగానికి అంకితం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని 185 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పాస్‌పుస్తకాలపై సొంత ఫోటోలు వేయించి రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ ఫోటోలను తొలగించి అధికారిక రాజముద్రతో కూడిన పుస్తకాలను అందజేయడం ప్రజా పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.