Thursday, 3 September 2026
  • Home  
  • పాత నగలకు సాన పెడతామని నమ్మించి.. వెండి మాయం 18 తులాల వెండిని రసాయనంతో 8 తులాలకు తగ్గించిన మోసగాళ్లు
- ఖమ్మం

పాత నగలకు సాన పెడతామని నమ్మించి.. వెండి మాయం 18 తులాల వెండిని రసాయనంతో 8 తులాలకు తగ్గించిన మోసగాళ్లు

నేలకొండపల్లి/ ఖమ్మం పాత వెండి నగలకు సాన పెడతామని నమ్మించి వెండిని కాజేసిన ఘటన నేలకొండపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన పంకజ్, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పాత వెండి నగలకు సాన పెడతామని చెప్పి త్రివేణి వద్ద నుంచి 18 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. అనంతరం వాటిని రసాయనంలో వేసి సుమారు 8 తులాల వెండిగా తగ్గించినట్లు బాధితురాలు గుర్తించింది. దీంతో త్రివేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన స్థానికులు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి. శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

నేలకొండపల్లి/ ఖమ్మం
పాత వెండి నగలకు సాన పెడతామని నమ్మించి వెండిని కాజేసిన ఘటన నేలకొండపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన పంకజ్, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పాత వెండి నగలకు సాన పెడతామని చెప్పి త్రివేణి వద్ద నుంచి 18 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. అనంతరం వాటిని రసాయనంలో వేసి సుమారు 8 తులాల వెండిగా తగ్గించినట్లు బాధితురాలు గుర్తించింది. దీంతో త్రివేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన స్థానికులు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి. శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.