కాకినాడ, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడలోని GRT గ్రాండ్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలు, రేషన్ సరుకుల పంపిణీ, ప్రజలకు అందుతున్న సేవలపై ఇరువురు చర్చించారు. పీడీఎస్ ద్వారా సీమరైస్ పంపిణీతో పాటు రేషన్ దుకాణాల్లో ‘మీ మార్ట్’ ఏర్పాటు వంటి అంశాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి