టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా
పెద్దపల్లి, సెప్టెంబర్ 01:
ఎస్ఐ, పీసీ, ఎఫ్బీఓ, జీపీఓ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా తెలిపారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు వాట్సాప్ గ్రూప్‌లో చేరి తమ పూర్తి వివరాలను పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9700577556 నంబర్‌ను, వాట్సాప్ గ్రూప్ లింక్: https://chat.whatsapp.com/HCGtGeeQynz2qpjU8bRY7S సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షులు వెంగల కృష్ణ, పెద్దపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల ప్రశాంత్, గోగు సురేష్ , తదితరులు పాల్గొన్నారు.


