నెల్లూరు: MROకు ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులు
మనుబోలు తహశీల్దార్‌కు ఏసీబీ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేస్తూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది. 9581478081 నంబర్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి.. కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన తహశీల్దార్ వెంటనే మనుబోలు ఎస్సై మహమ్మద్ హనీఫ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


