ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే యూపీఐ లావాదేవీలు చేసేలా ‘ఫోన్ పే’ కొత్త సేవలను ప్రారంభించింది.
‘ఫోన్ పే యూపీఐ 123పే’ పేరిట దీన్ని తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందికిపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని, తమ సేవలతో డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు విస్తరిస్తాయని సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ అన్నారు.


