*పెన్షన్ విద్రోహ విధానాలను ఉపసంహరించాలి – పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి:Tsutf
—————————————————————–
*జనగామ కలెక్టరేట్ ఎదుట TGEJAC ఆధ్వర్యంలో నిరసన*
జనగామ, సెప్టెంబర్ 1:
ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రతను దెబ్బతీసే పెన్షన్ విధానాలను వ్యతిరేకిస్తూ, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి TGEJAC కో-చైర్మెన్ చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే వరం కాదని, సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన హక్కు అని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
🔹 పాత పెన్షన్ విధానం (OPS)ను తక్షణమే పునరుద్ధరించాలి.
🔹 CPS/UPS విధానాలను ఉపసంహరించి ఉద్యోగులకు పూర్తి పెన్షన్ భద్రత కల్పించాలి.
🔹 ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడిపేలా పెన్షన్ హక్కును కాపాడాలి.
🔹 పెన్షన్ నిధులపై ఉద్యోగులకు నష్టదాయకమైన విధానాలను రద్దు చేయాలి.
🔹 ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.
🔹 పెన్షన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయాలి.అని డిమాండ్ చేశారు
TGEJAC సెక్రటరీ కొర్నేలియస్ మాట్లాడుతూ
పెన్షన్ సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, TNGO ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , లక్ష్మణ మూర్తి ,మాడూరి వెంకటేష్ ,రామస్వామి ,రాజయ్య ,మనోజ్ ,కృష్ణమూర్తి ,రాం నర్సయ్య ,జ్యోతి , ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“పెన్షన్ మా హక్కు – భిక్ష కాదు!”
“పాత పెన్షన్ విధానం – ఉద్యోగుల సామాజిక భద్రతకు రక్షణ!”అని నినాదాలు ఇచ్చారు


