*సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగుల నిరసన*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. జేఏసీ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
TGCPSEU జిల్లా అధ్యక్షుడు చర్ల శ్రీనివాసరావు నాయకత్వంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై సీపీఎస్ విధానంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించేందుకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్ పెన్షన్‌పై అనిశ్చితి నెలకొంటుందని, దీర్ఘకాలికంగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు OPS విధానం ఎంతో అవసరమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.


