గ్యాస్ సిలిండర్ లారీ–సిమెంట్ ట్యాంకర్ ఢీ.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు
వాసిలి సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ గంగాధర్, ఎస్సై జంపానీ కుమార్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.


