Wednesday, 2 September 2026
  • Home  
  • ప్రధాని పుట్టినరోజున 30 రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు- రాష్ట్ర మంత్రి సత్య కుమార్ పిలుపు
- తిరుపతి

ప్రధాని పుట్టినరోజున 30 రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు- రాష్ట్ర మంత్రి సత్య కుమార్ పిలుపు

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 01, (పున్నమి న్యూస్): భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన “సేవా సంకల్ప ఉత్సవం” విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి విస్తృత కార్యశాలను ఘనంగా నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల సేవా సంకల్ప ఉత్సవ కార్యక్రమాల ఇన్‌చార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో భారతదేశాన్ని రాబోయే 2047 నాటికి ప్రపంచ విశ్వగురువుగా నిలిపేందుకు ఈ సేవా సంకల్ప ఉత్సవాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఈ సేవా ఉత్సవాలను విజయవంతం చేయడం ద్వారా ప్రజలందరిలో ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతం) సంకల్పం మరింత బలంగా ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. 30 రోజుల పాటు సాగే ఈ మోదీ సేవా సంకల్ప ఉత్సవాలను రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామం, అట్టడుగు ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలని శ్రేణులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు నిరుపేదలకు వైద్య శిబిరాలు, రక్తదానం, వస్త్ర వితరణ వంటి సేవా కార్యక్రమాలను అట్టడుగు ప్రజానీకానికి చేర్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కార్యశాలలో తిరుపతి జిల్లా ప్రతినిధులుగా సేవా సంకల్ప ఉత్సవ కమిటీ సభ్యులు సత్యవేడు మునికృష్ణయ్య, మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, బండారు పార్ధసారధి, గడ్డం చెంగల్ రాజు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసిన బీజేపీ ముఖ్య నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.