నంద్యాల:బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు నంద్యాల జేఎస్‌సీఎం (JSCM) కోర్టు ఏడు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.నంద్యాల మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 24న రామకృష్ణ, విజయ్‌లతో పాటు మరొక వ్యక్తి బహిరంగంగా మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి విచారణ అనంతరం ముగ్గురికీ ఏడు రోజుల జైలు శిక్ష ఖరారు చేశారు.ఈ సందర్భంగా మూడో పట్టణ ఎస్సై జి. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.

బహిరంగ మద్యపానం: ముగ్గురికి ఏడు రోజుల జైలు శిక్ష