విశాఖ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలని, ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి 100 శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని నగర అధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ పరిధి ఇన్‌చార్జిలు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రతి వార్డులో ఘనంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని, జీవీఎంసీలో 120 వార్డులకు సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, మేయర్ ఎన్నికకు ప్రత్యేక వ్యూహంతో వెళ్తామని, నవంబర్ 20 లోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.


