💥 రూ.1,820 నగదు.. 52 పేక ముక్కలు స్వాధీనం
విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి, )ఆగస్టు 21:: భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాత కుమ్మరిపాలెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న 07 మందిని పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.1,820 నగదు, 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
⚠️ పేకాటకు దూరంగా ఉండండి.. పోలీసుల హెచ్చరిక
పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని భీమునిపట్నం పోలీసులు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


