Thursday, 3 September 2026
  • Home  
  • ఖాళీ ఇళ్లు పేదలకు కేటాయించాలి
- BHADRADRI

ఖాళీ ఇళ్లు పేదలకు కేటాయించాలి

బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు, 21 (పున్నమి ప్రతినిధి) రామవరం ప్రాంతంలో 7 ఇంక్లైన్ నుంచి వచ్చిన వారికి గతంలో కేటాయించిన ఖాళీ స్థలాల్లో పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో ఆ స్థలాలు, అసంపూర్తి ఇళ్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. మరోవైపు రామవరం ప్రాంతంలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో పాత కొత్తగూడెంలో ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించిన విధంగానే రామవరంలోనూ వినియోగంలో లేని ఇళ్లను గుర్తించి స్థానికంగా నివసించే ఇల్లు లేని పేదలకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఇళ్లను నిర్మించకుండా వదిలేసిన లబ్ధిదారుల వివరాలను సేకరించి, అర్హులైన నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు, 21 (పున్నమి ప్రతినిధి)

రామవరం ప్రాంతంలో 7 ఇంక్లైన్ నుంచి వచ్చిన వారికి గతంలో కేటాయించిన ఖాళీ స్థలాల్లో పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో ఆ స్థలాలు, అసంపూర్తి ఇళ్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. మరోవైపు రామవరం ప్రాంతంలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో పాత కొత్తగూడెంలో ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించిన విధంగానే రామవరంలోనూ వినియోగంలో లేని ఇళ్లను గుర్తించి స్థానికంగా నివసించే ఇల్లు లేని పేదలకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఇళ్లను నిర్మించకుండా వదిలేసిన లబ్ధిదారుల వివరాలను సేకరించి, అర్హులైన నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.