Friday, 21 August 2026
  • Home  
  • రోడ్డు పక్కన పూజా సామగ్రి అమ్మితే చర్యలెందుకు?
- ఖమ్మం

రోడ్డు పక్కన పూజా సామగ్రి అమ్మితే చర్యలెందుకు?

ఖమ్మం: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో ఖమ్మం నగరము లోని స్థానిక SR&BGNR కాలేజీ దగ్గర పూర్తి గా రోడ్డుపక్కన పూజా సామగ్రి అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ప్రశ్నించారు. పండుగ సందర్భంగా చిన్న వ్యాపారులు ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసుకున్న దుకాణాలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. అదే సమయంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల ముందు ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్న వ్యాపారులపై నిబంధనలు కఠినంగా అమలు చేసే పోలీసులు, భారీ ట్రాఫిక్‌కు కారణమవుతున్న పెద్ద షాపింగ్ మాల్స్ విషయంలోనూ సమానంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.