ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: CCV
🔶 యూనిఫామ్‌లు, పుస్తకాలను నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని ఒత్తిడి చేయొద్దు.
🔷 ఫీజుల వివరాలను వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో తప్పనిసరిగా ప్రకటించాలి.
🔶 రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలపై Compliance Audit నిర్వహించాలి.
హైదరాబాద్ తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల హక్కులు, ఫీజుల పారదర్శకత, ప్రవేశ విధానం, మౌలిక వసతులు, రవాణా మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని Council for Citizens Voice (CCV) పాఠశాల విద్యాశాఖను కోరింది.
ఈ మేరకు CCV ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించి, ప్రైవేట్ పాఠశాలలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
యూనిఫామ్‌లు, పుస్తకాల కొనుగోళ్లపై ఒత్తిడి వద్దు
పాఠశాల యాజమాన్యాలు తమ ప్రాంగణంలోని కౌంటర్లలో లేదా తాము సూచించిన Designated Shops నుంచే యూనిఫామ్‌లు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ కొనుగోలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని CCV కోరింది.
తల్లిదండ్రులు తమకు అనుకూలమైన మార్కెట్‌లో నాణ్యత, ధరలను పరిశీలించి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలని పేర్కొంది.
🔷 ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి.
ప్రతి ప్రైవేట్ పాఠశాల వసూలు చేస్తున్న Tuition Feeతో పాటు వర్తించే ఇతర ఫీజుల వివరాలను పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే పాఠశాల నోటీసు బోర్డులో స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని CCV డిమాండ్ చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వసూలు చేసే ప్రతి మొత్తానికి అధికారిక రసీదు ఇవ్వాలని, క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ లేదా ఇతర అనధికారిక వసూళ్లను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరింది.
🔶 ప్రవేశ ప్రక్రియలో పారదర్శకత అవసరం.
RTE Act, 2009తో పాటు వర్తించే విద్యా చట్టాలు, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని CCV కోరింది.
అలాగే G.O.Ms.No.1లో పేర్కొన్న పాఠశాల Permission, Recognition మరియు Recognition Conditions అమలుపై రాష్ట్రవ్యాప్తంగా సమీక్ష నిర్వహించాలని కోరింది.
G.O.Ms.No.42, School Education (PE.Prog.I) Department, dated 30-07-2010లో Screening Test, Capitation Fee, Fee Structure, Admission Procedure, Minimum Facilities, Vigilance తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని CCV పేర్కొంది.
ప్రైవేట్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఆట స్థలాలు వంటి మౌలిక వసతులతో పాటు Fire Safety, Building Safety, Structural Stability, Emergency Evacuation ప్రమాణాలను కూడా తనిఖీ చేయాలని CCV కోరింది.
CCV వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై పాఠశాల విద్యాశాఖ మరియు సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను Action Taken Report (ATR) లేదా లిఖితపూర్వక సమాధానం రూపంలో అందించాలని CCV కోరింది.
విద్యార్థుల హక్కులు, బాలల భద్రత, విద్యా చట్టాల అమలు, ఫీజుల పారదర్శకత మరియు ప్రజా ప్రయోజనాన్ని పరిరక్షించడమే తమ వినతిపత్రం ప్రధాన ఉద్దేశ్యమని CCV ప్రతినిధులు తెలిపారు. ఈ యొక్క విషయంపై విద్యాశాఖ డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కే. నరేష్ బాబు, కే. రామ్మోహన్, వై. మాధవరెడ్డి, వి. వెంకటేష్, మహేశ్వర్ రెడ్డి, బి. శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

