Wednesday, 26 August 2026
  • Home  
  • తప్పులు బయటపడతాయనే భయంతోనే వైకాపా అసెంబ్లీ బహిష్కరణ-మాసారపు సుబ్బయ్య
- తిరుపతి

తప్పులు బయటపడతాయనే భయంతోనే వైకాపా అసెంబ్లీ బహిష్కరణ-మాసారపు సుబ్బయ్య

శ్రీ కాళహస్తి, ఆగస్టు 20, (పున్నమి న్యూస్): కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకే జవాబుదారీ అని, కుట్రలు చేసే పార్టీలకు లేదా వ్యక్తులకు కాదని, వైఎస్సార్సీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు మాసారపు సుబ్బయ్య సవాల్ విసిరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలు అసెంబ్లీ వేదికగా ఎక్కడ బయటపడతాయో, జగన్ అడ్డంగా దొరికిపోతాడనే భయంతోనే ఆ పార్టీ నేతలు సభకు రాకుండా పారిపోతున్నారని మురళీనాయుడు తరహాలో ధ్వజమెత్తారు. రోడ్డుపై ప్రమాదం చేసి పారిపోయే హిట్ అండ్ రన్ సంస్కృతిలా వైఎస్సార్సీపీ తీరు ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి పూర్తి భరోసా ఇస్తున్నామని, నియామకాలన్నీ అత్యంత పారదర్శకతతో, జవాబుదారీతనంతో జరిగాయని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పోటీ పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని వెల్లడించారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాలుకు ప్రతిపక్ష నేతలకు నిజంగానే చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే తక్షణమే చర్చకు రావాలని, దమ్ముంటే ఆ సవాలును స్వీకరించాలని మాసారపు సుబ్బయ్య గట్టిగా డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.