అభివృద్ధి సంక్షేమమే టీడీపీ ప్రధాన అజెండా అని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని పిల్లిగుండ్ల, ఒంటేడుదిన్నె గ్రామాలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్కు మేళతాళతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని వీదుల్లో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమమే కూటమీ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం చేపటుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ, జీరో వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సీడీ, ఏడాదిలో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం ద్వార రూ.13,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పుట్టిన అడబిడ్డకు రూ.40వేలు డిపాజిట్, యువతకు స్వయం ఉపాధి కల్పన తదితర సంక్షేమ పథకాలను గురించి వివరించారు. సంక్షేమం భవిష్యత్కు భరోసా అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్యనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉల్లిగడ్డ రాముడు, పిల్లిగుండ్ల కృష్ణ, ఎమ్మిగనూరు మార్కెట్ చైర్మన్ మల్లయ్య, తెలుగుయువత అధ్యక్షుడు ఐరన్బండ
బాషా, ఐటీడీపి రాంపురం రఫిక్, రవి, రమేష్నాయుడు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


