యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీయుడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజ సేవలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి పారితోషికాలు అందించారు. ఏపీయుడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ మెంబర్ గుమ్మెళ్ల గోవిందరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర సింహాచలం మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. 70 ఏళ్లుగా ఏపీయుడబ్ల్యూజే సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

70 ఏళ్ల జర్నలిస్టుల సేవకు ఘన నివాళి.. యలమంచిలిలో ఏపీయుడబ్ల్యూజే వేడుకలు
యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీయుడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజ సేవలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి పారితోషికాలు అందించారు. ఏపీయుడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ మెంబర్ గుమ్మెళ్ల గోవిందరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర సింహాచలం మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. 70 ఏళ్లుగా ఏపీయుడబ్ల్యూజే సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

