కడప జిల్లా పులివెందుల పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికెత్ ఆదేశాలతో పులివెందుల డి.ఎస్.పి మురళి నాయక్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు ప్రత్యేకంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర వాహన పత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలను నిబంధనలకు అనుగుణంగా నడపాలని సూచించారు. అలాగే వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ముఖ్యంగా యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రానున్న రోజుల్లో కూడా పులివెందుల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

పులివెందులలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు