ఈ నెల 19న అమలాపురంలో జాబ్ మేళా.
పి గన్నవరం నుండి ఆగస్టు 17 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
జిల్లా ఉపాధి కార్యాలయం వారి ఆధ్వర్యంలో అమలాపురం లో మిరియం డిగ్రీ కాలేజ్ నందు ఆగస్టు 19వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఆర్. వహీదా తెలిపారు. ప్రముఖ 10 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని కావున 18 – 35 సంవత్సరాల వయసు కలిగిన పురుష, మహిళ అభ్యర్థులు అర్హులని కంపెనీల నియమాలను అనుసరించి ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింక్ లో రిజిస్ట్రేషన్ ఎస్సీ చేసుకుని ఇంటర్వ్యూ కు హాజరు కావాలని కోరారు. https://naipunyam.ap.gov.in మరిన్ని వివరాలు కోసం ఈక్రింది నెంబర్లకు సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ నల్లా తమేశ్వరరావు సోమవారం తెలిపారు
9000831156, 9380808275
9988853335, 8712655686

ఉపాధ్యాయులను సత్కరించిన గ్రామ పెద్దలు
పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 17 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం శివారు గుత్తులవారిపాలెం లో ఉన్న ప్రాథమిక పాఠశాల నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 శనివారం ఉదయం 9 గంటల నుండి అత్యంత జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాల ప్రాధాన్యొ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు (నాగపండు) ఉపాధ్యాయులు గుబ్బల షణ్ముఖరావు ను పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ శీలం ప్రసాద్ ను గుత్తులవారి పాలెం మాజీ వార్డ్ నెంబర్ కుడుపూడి శ్రీను. చెల్లుబోయిన నాగభూషణం. పలివెల శంకర్. అంబటివారిపాలెం గ్రామ పెద్దలు. బూల పెద్దిరాజు. నూకపై శ్రీను (నల్లశ్రీను) గోసంగి వెంకటేష్. ఆకుమర్తి సూరిబాబు. నెల్లి వెంకటరమణ. తదితరులు
ఘనంగా సత్కరించారు


