(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
భారతదేశ రక్షణ అంతరిక్ష రంగంలో ల్యాబ్ నుంచి లాంచ్ వరకు ప్రయాణం వేగవంతం చేయడం పై దృష్టి పెరిగిందని డి.ఆర్.డి.ఒ మాజీ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి సమయం లో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయని, గతంలో రక్షణ రంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 8 నుంచి 15 ఏళ్లు పట్టేవని ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, స్టార్టప్ ల భాగస్వామ్యంతో కేవలం రెండు నుంచి నాలుగు ఏళ్ల లోపే పూర్తి అవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంతో తాజా విజయం దక్కించుకున్న భారత్ ప్రపంచంలో మూడవ దేశం అని ఆయన కొనియాడారు. స్కై రూట్ అనే సంస్థ యువ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సాధించిన విజయం స్ఫూర్తిని ఇస్తుందని స్పేస్ లో భారతదేశం పాత్ర విస్తృతం అవుతుందని అన్నారు.
ప్రైవేటు రంగంలో స్టార్టప్ ల పాత్ర కీలకం అయిందని డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్ష పరికరాలు,అధునాతన ప్రొపల్టన్ సిస్టమ్ వంటి క్లిష్టమైన రంగాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఐడెక్స్, టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ వంటి పధకాలు వందల స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. .స్వయం సమృద్ధ భారతదేశం బిల్డ్ టు ప్రింట్ విధానం నుండి బిల్డ్ టు స్పెసిఫికేషన్ విధానం కు మారడం గమనార్హం అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇందు వలన స్వదేశీ డిజైన్ లో భారీ మార్పులు చోటు చేసుకుని సామర్థ్యం ఎంతగానో మెరుగు పడిందని తెలిపారు.
ఉదాహరణకు, యల్ సి ఎ మార్క్ 2 తేలికపాటి యుద్ద ట్యాంకుల తయారీ వేగవంతం కావడమే ప్రత్యక్ష ఉదాహరణ అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు..
భవిష్యత్తు లక్ష్యాల పై ప్రత్యేక దృష్టి పెట్టే క్రమం లో : కేవలం విదేశీ సాంకేతికతను కాపీ చేయకుండా, క్వాంటం సెన్సార్లు హై-పవర్ లేజర్లు వంటి సరికొత్త వినూత్న ఆవిష్కరణల కు అవకాశం కల్పించుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో భారత రక్షణ ఎగుమతులు దూసుకుపోతున్నాయని
38,000 కోట్లకు చేరుకోవడం మేక్ ఫర్ ది వరల్డ్
‘అనే లక్ష్యానికి నిదర్శనమని సతీష్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు

ల్యాబ్ టు లాంచ్ వేగవంతం పై దృష్టి డి.ఆర్.డి.ఒ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి
(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) భారతదేశ రక్షణ అంతరిక్ష రంగంలో ల్యాబ్ నుంచి లాంచ్ వరకు ప్రయాణం వేగవంతం చేయడం పై దృష్టి పెరిగిందని డి.ఆర్.డి.ఒ మాజీ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి సమయం లో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయని, గతంలో రక్షణ రంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 8 నుంచి 15 ఏళ్లు పట్టేవని ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, స్టార్టప్ ల భాగస్వామ్యంతో కేవలం రెండు నుంచి నాలుగు ఏళ్ల లోపే పూర్తి అవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంతో తాజా విజయం దక్కించుకున్న భారత్ ప్రపంచంలో మూడవ దేశం అని ఆయన కొనియాడారు. స్కై రూట్ అనే సంస్థ యువ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సాధించిన విజయం స్ఫూర్తిని ఇస్తుందని స్పేస్ లో భారతదేశం పాత్ర విస్తృతం అవుతుందని అన్నారు. ప్రైవేటు రంగంలో స్టార్టప్ ల పాత్ర కీలకం అయిందని డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్ష పరికరాలు,అధునాతన ప్రొపల్టన్ సిస్టమ్ వంటి క్లిష్టమైన రంగాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఐడెక్స్, టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ వంటి పధకాలు వందల స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. .స్వయం సమృద్ధ భారతదేశం బిల్డ్ టు ప్రింట్ విధానం నుండి బిల్డ్ టు స్పెసిఫికేషన్ విధానం కు మారడం గమనార్హం అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇందు వలన స్వదేశీ డిజైన్ లో భారీ మార్పులు చోటు చేసుకుని సామర్థ్యం ఎంతగానో మెరుగు పడిందని తెలిపారు. ఉదాహరణకు, యల్ సి ఎ మార్క్ 2 తేలికపాటి యుద్ద ట్యాంకుల తయారీ వేగవంతం కావడమే ప్రత్యక్ష ఉదాహరణ అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.. భవిష్యత్తు లక్ష్యాల పై ప్రత్యేక దృష్టి పెట్టే క్రమం లో : కేవలం విదేశీ సాంకేతికతను కాపీ చేయకుండా, క్వాంటం సెన్సార్లు హై-పవర్ లేజర్లు వంటి సరికొత్త వినూత్న ఆవిష్కరణల కు అవకాశం కల్పించుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో భారత రక్షణ ఎగుమతులు దూసుకుపోతున్నాయని 38,000 కోట్లకు చేరుకోవడం మేక్ ఫర్ ది వరల్డ్ ‘అనే లక్ష్యానికి నిదర్శనమని సతీష్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు

