ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు హైవే నుంచి పొదలకూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి ఇరువైపులా మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లక గంటలపాటు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులపై భారీ వాహనాలు వెళ్లే సమయంలో నీరు చిమ్మి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే ఆర్‌అండ్‌బి అధికారులు బ్రిడ్జిని తనిఖీ చేసి, ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
చినుకుకే జలమయ బ్రిడ్జి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు హైవే నుంచి పొదలకూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి ఇరువైపులా మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లక గంటలపాటు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులపై భారీ వాహనాలు వెళ్లే సమయంలో నీరు చిమ్మి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే ఆర్‌అండ్‌బి అధికారులు బ్రిడ్జిని తనిఖీ చేసి, ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

