విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 10 ::
స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం బీచ్‌లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. IATO సభ్యులు, అధికారులు కలిసి బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తూ పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, సముద్రతీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. బీచ్‌లో చెత్త వేయకుండా ప్రజలు, పర్యాటకులు సహకరించాలని నిర్వాహకులు సూచించారు.
“పరిశుభ్రమైన బీచ్.. ఆరోగ్యకరమైన సమాజం” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


