Thursday, 14 May 2026
  • Home  
  • రామానాయుడి కష్టం వారసులకు వద్దు .. బీదా రవిచంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామానాయుడి కష్టం వారసులకు వద్దు .. బీదా రవిచంద్ర

దగదర్తి రాజకీయాలలో ప్రత్యేకతను పొందిన మాలెపాటి రామానాయుడు జీవితమంతా కష్టాలతో గడిచిందని ఆ తర్వాతి తరానికి చెందిన వారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ సమస్యలను ఎదుర్కొనే నేపథ్యంలో తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర పేర్కొన్నారు రామానాయుడు తో పోలిస్తే రవీంద్ర ,సుబ్బానాయుడు పరిస్థితి కొంత మెరుగని నేటి యువతరం వాటిని అధ్యయనం చేసుకుంటూ తమ సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యం మరువలేనిదని సుబ్బానాయుడు లాంటి స్నేహితుడిని తాను అకాలంగా కోల్పోవడం ఎంతో వేదనకు గురిచేసిందని రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తాత్కాలికమని ఆవేశాలకు గురికాకుండా ప్రజలతో మమేకమైనప్పుడు దక్కాల్సింది దక్కకుండా పోదని కూడా ఆయన లొకేష్, నరేష్ లకు సూచిస్తూ దగదర్తిలో మాలెపాటి రాజకీయ అధికారానికి ఎలాంటి డోకా ఉండదని మండలంలో వారి మనుగడ యధావిధిగా కొనసాగుతుందని రవిచంద్ర సుబ్బానాయుడు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా దగదర్తి వెలుపోడు రోడ్డు సెంటర్లోని సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వైద్య శిబిరం ను రవిచంద్ర ప్రారంభించారు. కంచర్ల సునీల్, సుధాకర్ నాయుడు, నరేష్, లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు ఫియోనిక్స్ హాస్పిటల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో వందలాది సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచితంగా మందులు అందుకున్నారు. మాలేపాటి లోకేష్, నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకునే కానీ ఈరోజున వారి జయంతి జరుపుకోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు., సుబ్బానాయుడు గారు తమకు దైవంతో సమానమని, ఆయన లేకపోయినా నడిపిస్తున్న పెదనాన్న రవీంద్ర నాయుడు ఎప్పటికీ ఆదర్శమే అని పేర్కొన్నారు.. ఈ కష్ట కాలంలో ప్రతి విషయంలో తమకు సహాయ సహకారాలు అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ బీద రవిచంద్ర ల సాయం మరువలేనిదని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తన తండ్రి సుబ్బానాయుడు లా అహర్నిశలు కృషి చేస్తానని, అండగా నిలబడుతున్న దగదర్తి మండల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానని లోకేష్ ఈ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం దగదర్తి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటి వంశ అభిమానులు జోహార్ మాలేపాటి సుబ్బానాయుడు , అమర్ రహే మాలేపాటి సుబ్బానాయుడు అని నినాదాలు చేస్తూ తీవ్ర ఉద్వేగంతో ఆయన లేని లోటు పై కన్నీళ్లు పెట్టుకున్నారు.

దగదర్తి రాజకీయాలలో ప్రత్యేకతను పొందిన మాలెపాటి రామానాయుడు జీవితమంతా కష్టాలతో గడిచిందని ఆ తర్వాతి తరానికి చెందిన వారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ సమస్యలను ఎదుర్కొనే నేపథ్యంలో తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర పేర్కొన్నారు రామానాయుడు తో పోలిస్తే రవీంద్ర ,సుబ్బానాయుడు పరిస్థితి కొంత మెరుగని నేటి యువతరం వాటిని అధ్యయనం చేసుకుంటూ తమ సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యం మరువలేనిదని సుబ్బానాయుడు లాంటి స్నేహితుడిని తాను అకాలంగా కోల్పోవడం ఎంతో వేదనకు గురిచేసిందని రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తాత్కాలికమని ఆవేశాలకు గురికాకుండా ప్రజలతో మమేకమైనప్పుడు దక్కాల్సింది దక్కకుండా పోదని కూడా ఆయన లొకేష్, నరేష్ లకు సూచిస్తూ దగదర్తిలో మాలెపాటి రాజకీయ అధికారానికి ఎలాంటి డోకా ఉండదని మండలంలో వారి మనుగడ యధావిధిగా కొనసాగుతుందని రవిచంద్ర సుబ్బానాయుడు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా దగదర్తి వెలుపోడు రోడ్డు సెంటర్లోని సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వైద్య శిబిరం ను రవిచంద్ర ప్రారంభించారు. కంచర్ల సునీల్, సుధాకర్ నాయుడు, నరేష్, లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు ఫియోనిక్స్ హాస్పిటల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో వందలాది సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచితంగా మందులు అందుకున్నారు.
మాలేపాటి లోకేష్, నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకునే కానీ ఈరోజున వారి జయంతి జరుపుకోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు., సుబ్బానాయుడు గారు తమకు దైవంతో సమానమని, ఆయన లేకపోయినా నడిపిస్తున్న పెదనాన్న
రవీంద్ర నాయుడు ఎప్పటికీ ఆదర్శమే అని పేర్కొన్నారు.. ఈ కష్ట కాలంలో ప్రతి విషయంలో తమకు సహాయ సహకారాలు అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ బీద రవిచంద్ర ల సాయం మరువలేనిదని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తన తండ్రి సుబ్బానాయుడు లా అహర్నిశలు కృషి చేస్తానని, అండగా నిలబడుతున్న దగదర్తి మండల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానని లోకేష్ ఈ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం దగదర్తి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటి వంశ అభిమానులు జోహార్ మాలేపాటి సుబ్బానాయుడు , అమర్ రహే మాలేపాటి సుబ్బానాయుడు అని నినాదాలు చేస్తూ తీవ్ర ఉద్వేగంతో
ఆయన లేని లోటు పై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.