Thursday, 13 August 2026
  • Home  
  • ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీల మహా ధర్నా 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు కోసం వెయ్యికి పైగా వైద్య విద్యార్థులు, వైద్యుల ఆందోళన
- నాగర్‌కర్నూల్

ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీల మహా ధర్నా 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు కోసం వెయ్యికి పైగా వైద్య విద్యార్థులు, వైద్యుల ఆందోళన

పున్నమి: హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల స్టైపెండ్ పెంపు కోసం తెలంగాణ ఆయుష్ హెచ్‌ఎస్ మరియు పీజీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య విద్యాసంస్థలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు, ఇంటర్న్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు ఈ మహా ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా స్టైపెండ్లు పెంచకపోవడం, ఆయుష్ వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు. ఐదు ప్రభుత్వ ఆయుష్ సంస్థల నుంచి భారీగా పాల్గొన్న విద్యార్థులు వివిధ వర్గాల నుంచి మద్దతు, ఈ మహా ధర్నాకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆయుష్ సంఘాల ప్రతినిధులు మరియు వైద్య రంగ ప్రముఖులు హాజరై ఆయుష్ వైద్యుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రీ శ్రవణ్ బిరాజ్, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, హైదరాబాద్ నగర కార్యదర్శి రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్యామ్, మహేష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ తిరునాగరి, డాక్టర్ జోష్నా తిరునాగరి, ప్రొఫెసర్ జోష్నా తిరునాగరి, డాక్టర్ ప్రేమానందరావు, డాక్టర్ కిషన్ బొద్దుల, డాక్టర్ జయకృష్ణ తదితరులు పాల్గొని ఆయుష్ వైద్యుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, ప్రజా ప్రతినిధులుగా సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అలాగే పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తదితరులు తమ మద్దతు ప్రకటించారు. ఇతర ప్రముఖుల్లో మాజీ తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ అనుపమ, డాక్టర్ మాధవ్ రెడ్డి (మెడికల్ వింగ్, జనసేన), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తదితరులు కూడా ఆయుష్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. “ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. ఆయుష్-జేఏసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్, డాక్టర్ నవనీత్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాకేష్, డాక్టర్ దర్శిని, డాక్టర్ బలీగ్, డాక్టర్ మహ్మూద్, డాక్టర్ ముషీర్, డాక్టర్ ఇబ్రహీం, డాక్టర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్ కుమార్, డాక్టర్ మసీహా, డాక్టర్ ప్రైజ్ ఏంజెల్, డాక్టర్ అనురాగ్‌తో పాటు పలువురు జేఏసీ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు జేఏసీ విజ్ఞప్తి ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆయుష్ వైద్యులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆయుష్ సంస్థలు కలిసి ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైతే ఈ పోరాటాన్ని తెలంగాణను దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు ఇస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు. “హామీలు కాదు — వెంటనే జీఓ కావాలి” ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసి, తదుపరి దశల్లో మరింత తీవ్రతరం చేస్తామని ఆయుష్-జేఏసీ హెచ్చరించింది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు — ఆయుష్‌కు సమానత్వం వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణ ఆయుష్ హెచ్‌ఎస్ మరియు పీజీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేశారు.

పున్నమి: హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల స్టైపెండ్ పెంపు కోసం తెలంగాణ ఆయుష్ హెచ్‌ఎస్ మరియు పీజీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య విద్యాసంస్థలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు, ఇంటర్న్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు ఈ మహా ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా స్టైపెండ్లు పెంచకపోవడం, ఆయుష్ వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు. ఐదు ప్రభుత్వ ఆయుష్ సంస్థల నుంచి భారీగా పాల్గొన్న విద్యార్థులు వివిధ వర్గాల నుంచి మద్దతు, ఈ మహా ధర్నాకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆయుష్ సంఘాల ప్రతినిధులు మరియు వైద్య రంగ ప్రముఖులు హాజరై ఆయుష్ వైద్యుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రీ శ్రవణ్ బిరాజ్, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, హైదరాబాద్ నగర కార్యదర్శి రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్యామ్, మహేష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ తిరునాగరి, డాక్టర్ జోష్నా తిరునాగరి, ప్రొఫెసర్ జోష్నా తిరునాగరి, డాక్టర్ ప్రేమానందరావు, డాక్టర్ కిషన్ బొద్దుల, డాక్టర్ జయకృష్ణ తదితరులు పాల్గొని ఆయుష్ వైద్యుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, ప్రజా ప్రతినిధులుగా సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అలాగే పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తదితరులు తమ మద్దతు ప్రకటించారు. ఇతర ప్రముఖుల్లో మాజీ తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ అనుపమ, డాక్టర్ మాధవ్ రెడ్డి (మెడికల్ వింగ్, జనసేన), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తదితరులు కూడా ఆయుష్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. “ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. ఆయుష్-జేఏసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్, డాక్టర్ నవనీత్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాకేష్, డాక్టర్ దర్శిని, డాక్టర్ బలీగ్, డాక్టర్ మహ్మూద్, డాక్టర్ ముషీర్, డాక్టర్ ఇబ్రహీం, డాక్టర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్ కుమార్, డాక్టర్ మసీహా, డాక్టర్ ప్రైజ్ ఏంజెల్, డాక్టర్ అనురాగ్‌తో పాటు పలువురు జేఏసీ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు జేఏసీ విజ్ఞప్తి
ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆయుష్ వైద్యులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆయుష్ సంస్థలు కలిసి ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైతే ఈ పోరాటాన్ని తెలంగాణను దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు ఇస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు. “హామీలు కాదు — వెంటనే జీఓ కావాలి” ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసి, తదుపరి దశల్లో మరింత తీవ్రతరం చేస్తామని ఆయుష్-జేఏసీ హెచ్చరించింది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు — ఆయుష్‌కు సమానత్వం వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణ ఆయుష్ హెచ్‌ఎస్ మరియు పీజీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.