Thursday, 14 May 2026
  • Home  
  • బాబు రాకతో తీరం బ్యాలెన్స్ అయ్యేనా.. బిఎంఆర్ హాజరుపై ఆసక్తి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బాబు రాకతో తీరం బ్యాలెన్స్ అయ్యేనా.. బిఎంఆర్ హాజరుపై ఆసక్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట పర్యటన ఖరారు కావడంతో తీర ప్రాంతంలో మరల కొత్త ఆలోచనల తాకిడి ఎక్కువైంది. మత్స్యకారులకు క్రాప్ హాలిడే ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మలపెంటలో 19వ తేదీన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది విశేషమే. రెండు నెలల క్రితం జరిగిన బోట్ల అపహరణ సంఘటన ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న తరుణంలో ఏరి కోరి చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక విశేషంగా మారింది. పడవల విషయంలో నష్టపరిహారం నిర్ణయిస్తూ పంచాయతీ అయినా, బాధ్యులను పట్టుకోవడంలో పడవలను తెప్పించడంలో అధికారులు చొరవ తీసుకోలేదనే ఆవేదన మత్స్యకారులలో కొనసాగుతోంది. మత్స్యకార గ్రామాలతో మమేకమైన మస్తాన్రావుకు ఊహించని విధంగా ఈ సంఘటన ఇబ్బంది పెట్టినా,ఆయన ఎన్నో విధాలుగా తన విజ్ఞప్తులను మత్స్యకార ప్రతినిధులకు మత్స్యకారులకు తెలుపుతూ వస్తున్న క్రమంలో పడవల సంఘటన క్రమంగా మరుపుకు గురి అవుతోంది. అదేవిధంగా మత్స్యకార సంక్షేమాన్ని కాంక్షిస్తూ జిల్లాకు మంత్రి రవీంద్రను పలుమార్లు రప్పించి తమిళ జాలర్ల నుంచి రక్షించే విధంగా తీసుకుంటున్న చర్యలను జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర విస్తృతంగా తెలపడంతో మత్యకారులలో కూడా కొంత ఆగ్రాహావేషాలు చల్లబడ్డాయి. అయితే ఈ సంఘటనపై జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నెలో సభ ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం పరిణామాలు తెలుగుదేశం వర్గాలు అధ్యయనం చేశాయా లేదా అన్నది అంతుచిక్కడం లేదు. అంతర్గతంగా మత్స్యకారులలో పడవల విషయం అంతర్లీనంగా రగులుతోందన్నది బహిరంగ సత్యమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు మేలు అన్నది పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం ప్రస్తుతం కొత్తది ఏమీ కాదు సాధారణంగా వారికి ఇస్తూ వస్తున్నదే. దీనికోసం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మళ్ళీ మత్స్యకారులలో లేనిపోని అలజడి కలిగించినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. రాజకీయాలకతీతంగా పడవల తరలింపు విషయంలో పోరాడుతామని మత్స్యకారుల కాపులు నిర్ణయించినా జగన్ సభకు భారీగానే తరలివచ్చారు. దురాయి ప్రచారం చేసినా, మత్స్య కారులు ‌హాజరుకారని ప్రకటనలు గుప్పించినా,. తీరంలో స్పందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సభకు కూడా మత్స్యకారులు అదే స్థాయిలో హాజరు కాకుండా పోయే ప్రశ్న లేకపోయినా సభలో పడవల తరలింపు విషయం బాధ్యులపై చర్యల విషయం అలజడి రేపుతోందనేది నిఘా వర్గాలు కూడా పసి కట్టాయా లేదా అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే మత్స్యకారుల ది విభిన్న శైలి కావడమే కారణం. పోతే బాబు సభకి కావలి ప్రాంతనేతగా రాజ్యసభ సభ్యుడు మస్తాన్రావు జిల్లా అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర హాజరు కాక తప్పదు .వారు హాజరైన సభలో మత్స్యకారుల వైఖరి ఎలా ఉంటుందనేది కూడా సందేహంగా మారింది. మరో పది రోజుల్లో కావలి వద్ద మహానాడు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు రాక అనేది అవసరమా ? ప్రశాంతంగా ఉంటున్న మత్స్యకార ప్రాంతంలో సభ ఏ మేరకు అనుకూలమొ అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరోపక్క వైసీపీ ఈ విషయంలో వ్యవరించే వైఖరి కూడా మత్స్యకారుల మనోభావాలను పై ఏ మేరకు అన్నది బీదా అభిమానులలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది.పడవల తరలింపు సంఘటన నుంచి ఇప్పటి వరకు మస్తాన్ రావు తనకు ఇష్టమైన తీరం టచ్ చేసిన దాఖలాలు లేవు, క్రమంగా కోలుకుంటున్న తరుణంలో చంద్రబాబు సభ బీద ప్రజలకు ఏ మేరకు లాభమో, నష్టమో కాలం నిర్ణయించాల్సి ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట పర్యటన ఖరారు కావడంతో తీర ప్రాంతంలో మరల కొత్త ఆలోచనల తాకిడి ఎక్కువైంది. మత్స్యకారులకు క్రాప్ హాలిడే ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మలపెంటలో 19వ తేదీన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది విశేషమే. రెండు నెలల క్రితం జరిగిన బోట్ల అపహరణ సంఘటన ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న తరుణంలో ఏరి కోరి చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక విశేషంగా మారింది. పడవల విషయంలో నష్టపరిహారం నిర్ణయిస్తూ పంచాయతీ అయినా, బాధ్యులను పట్టుకోవడంలో పడవలను తెప్పించడంలో అధికారులు చొరవ తీసుకోలేదనే ఆవేదన మత్స్యకారులలో కొనసాగుతోంది. మత్స్యకార గ్రామాలతో మమేకమైన మస్తాన్రావుకు ఊహించని విధంగా ఈ సంఘటన ఇబ్బంది పెట్టినా,ఆయన ఎన్నో విధాలుగా తన విజ్ఞప్తులను మత్స్యకార ప్రతినిధులకు మత్స్యకారులకు తెలుపుతూ వస్తున్న క్రమంలో పడవల సంఘటన క్రమంగా మరుపుకు గురి అవుతోంది. అదేవిధంగా మత్స్యకార సంక్షేమాన్ని కాంక్షిస్తూ జిల్లాకు మంత్రి రవీంద్రను పలుమార్లు రప్పించి తమిళ జాలర్ల నుంచి రక్షించే విధంగా తీసుకుంటున్న చర్యలను జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర విస్తృతంగా తెలపడంతో మత్యకారులలో కూడా కొంత ఆగ్రాహావేషాలు చల్లబడ్డాయి. అయితే ఈ సంఘటనపై జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నెలో సభ ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం పరిణామాలు తెలుగుదేశం వర్గాలు అధ్యయనం చేశాయా లేదా అన్నది అంతుచిక్కడం లేదు. అంతర్గతంగా మత్స్యకారులలో పడవల విషయం అంతర్లీనంగా రగులుతోందన్నది బహిరంగ సత్యమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు మేలు అన్నది పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం ప్రస్తుతం కొత్తది ఏమీ కాదు సాధారణంగా వారికి ఇస్తూ వస్తున్నదే. దీనికోసం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మళ్ళీ మత్స్యకారులలో లేనిపోని అలజడి కలిగించినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. రాజకీయాలకతీతంగా పడవల తరలింపు విషయంలో పోరాడుతామని మత్స్యకారుల కాపులు నిర్ణయించినా జగన్ సభకు భారీగానే తరలివచ్చారు. దురాయి ప్రచారం చేసినా, మత్స్య కారులు ‌హాజరుకారని ప్రకటనలు గుప్పించినా,.
తీరంలో స్పందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సభకు కూడా మత్స్యకారులు అదే స్థాయిలో హాజరు కాకుండా పోయే ప్రశ్న లేకపోయినా సభలో పడవల తరలింపు విషయం బాధ్యులపై చర్యల విషయం అలజడి రేపుతోందనేది నిఘా వర్గాలు కూడా పసి కట్టాయా లేదా అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే మత్స్యకారుల ది విభిన్న శైలి కావడమే కారణం. పోతే బాబు సభకి కావలి ప్రాంతనేతగా రాజ్యసభ సభ్యుడు మస్తాన్రావు జిల్లా అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర హాజరు కాక తప్పదు .వారు హాజరైన సభలో మత్స్యకారుల వైఖరి ఎలా ఉంటుందనేది కూడా సందేహంగా మారింది. మరో పది రోజుల్లో కావలి వద్ద మహానాడు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు రాక అనేది అవసరమా ? ప్రశాంతంగా ఉంటున్న మత్స్యకార ప్రాంతంలో సభ ఏ మేరకు అనుకూలమొ అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరోపక్క వైసీపీ ఈ విషయంలో వ్యవరించే వైఖరి కూడా మత్స్యకారుల మనోభావాలను పై ఏ మేరకు అన్నది బీదా అభిమానులలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది.పడవల తరలింపు సంఘటన నుంచి ఇప్పటి వరకు మస్తాన్ రావు తనకు ఇష్టమైన తీరం టచ్ చేసిన దాఖలాలు లేవు, క్రమంగా కోలుకుంటున్న తరుణంలో చంద్రబాబు సభ బీద ప్రజలకు ఏ మేరకు లాభమో, నష్టమో కాలం నిర్ణయించాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.