తిరుపతి జిల్లా చిట్వేలు మండల కేంద్రంలో మాజీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించి 112 మంది రక్తదానం చేశారు. సాధారణంగా జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్, ఇతర కార్యక్రమాలకే పరిమితమయ్యే బదులు రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది. మహేశ్వర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వాట్సప్ గ్రూపుల్లో యువత పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపింది. ప్రజా సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులపై తనను సంప్రదించే వారికి అందుబాటులో ఉంటారని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా పలువురు హాజరయ్యారు. మహేష్ రఘురాం రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో చిట్వేలు మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసరెడ్డి, మండల సీనియర్ నాయకులు ఎల్వీ మోహన్‌రెడ్డి, టౌన్ వైసీపీ అధ్యక్షుడు హజరత్‌రెడ్డి, యువ నాయకుడు నవీన్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు, యువత పాల్గొన్నారు.



