రాజమహేంద్రవరం రూరల్ :
పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం వార్డులు వారిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక 19వ డివిజన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపంలో సఖి సురక్ష కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం ద్వారా బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు స్క్రీన్ టెస్ట్ లు అవసరమైన వారికి మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వైద్యం అంధక ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అవసరమైన వారికి వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు . ఈ 14 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి
చర్యలు చేపడుతుందన్నారు. శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్, రొంపిచర్ల ఆంటోనీ, కొప్పిశెట్టి చిన్ని, కక్కల రమేష్, చిట్టిబోయిన శ్రీనివాస్, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, నరసింహమూర్తి, చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, వాసు, కుసుమ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


