Saturday, 29 August 2026
  • Home  
  • 22 ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వివరాలు వెంటనే సమర్పించాలి :
- జనగాం

22 ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వివరాలు వెంటనే సమర్పించాలి :

22-ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వెంటనే వివరాలు సమర్పించాలి —————————————————————– జనగామ, ఆగష్టు 27,పున్నమి ప్రతినిధి : భూభారతి–22-ఏ నమోదుల్లో వ్యత్యాసాలను పోర్టల్‌లోనే పరిష్కరించాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ 22-ఏ కింద నమోదు అయిన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి, వివరాలు సమర్పించాలని *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* కలెక్టర్లను ఆదేశించారు. గురువారం, హైదరాబాదు నుంచి *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* రాష్ట్రంలోని భూభారతి, 22-ఏ, సమగ్ర రీసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో *రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* మాట్లాడుతూ.. భూ భారతి డేటా ఆధారంగా ఎక్కడైనా 22-ఏ విస్తీర్ణంలో తేడాలు వస్తే వాటిని భూ భారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22-ఏ కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి సేకరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకోసం ప్రామాణిక కార్యాచరణ విధానం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ఆర్ఓలో వచ్చిన ఫిర్యాదులను ఏ రోజుకు ఆరోజే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూముల రీ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీసీ అనంతరం సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22-ఏలో నమోదు అయిన వాటిని గుర్తించి, వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రీ సర్వే నిర్వహించే విధంగా సర్వేయర్లను నియమించి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, జీపీపీ, పీపీబీ, నాలా, తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, డీ – సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

22-ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వెంటనే వివరాలు సమర్పించాలి
—————————————————————–
జనగామ, ఆగష్టు 27,పున్నమి ప్రతినిధి :
భూభారతి–22-ఏ నమోదుల్లో వ్యత్యాసాలను పోర్టల్‌లోనే పరిష్కరించాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్
22-ఏ కింద నమోదు అయిన వ్యవసాయ, వ్యవసాయేతర
భూముల వివరాలను గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి, వివరాలు సమర్పించాలని *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం, హైదరాబాదు నుంచి *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* రాష్ట్రంలోని భూభారతి, 22-ఏ, సమగ్ర రీసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో *రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* మాట్లాడుతూ.. భూ భారతి డేటా ఆధారంగా ఎక్కడైనా 22-ఏ విస్తీర్ణంలో తేడాలు వస్తే వాటిని భూ భారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22-ఏ కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి సేకరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు.
ఇందుకోసం ప్రామాణిక కార్యాచరణ విధానం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ఆర్ఓలో వచ్చిన ఫిర్యాదులను ఏ రోజుకు ఆరోజే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూముల రీ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వీసీ అనంతరం సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22-ఏలో నమోదు అయిన వాటిని గుర్తించి, వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రీ సర్వే నిర్వహించే విధంగా సర్వేయర్లను నియమించి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, జీపీపీ, పీపీబీ, నాలా, తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, డీ – సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.