భూవివాదం కేసులో రూ.75 వేలు లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్ చందానగర్ ఎస్ఐ బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ రాజ్కుమార్, స్టేషన్ రైటర్ రాఘవను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐని పోలీస్టేషన్లో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.



