ఎలమంచిలి, సెప్టెంబర్ 17 – పున్నమి ప్రతినిధి ఆనంద్:
ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషోత్సవాల్లో భాగంగా గురువారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్.వి.ఎన్.ఎస్. వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు హిందీ భాషలో బాలగీతాలు, గీతాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎన్.ఎన్.ఎల్.డి. భవాని మాట్లాడుతూ విద్యార్థులందరూ దేశంలో విస్తృతంగా ఉపయోగించే హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లిపాటి సత్యనారాయణ, డి.వి. భారతి, కే. రాజేష్, జి.ఎస్. కామేశ్వరి, టీ. ఇందిరారాణి, బి. నరేంద్ర, వై. భాస్కరరావుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


