Sunday, 23 August 2026
  • Home  
  • సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలి వాడలరేవు బాధిత కుటుంబాలకు మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య భరోసా
- విశాఖపట్నం

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలి వాడలరేవు బాధిత కుటుంబాలకు మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య భరోసా

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 22: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన వాడలరేవు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. శనివారం వాడలరేవు మత్స్యకార గ్రామాన్ని సందర్శించిన సమాఖ్య నాయకులు బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. సముద్రంలో చిక్కుకుపోయిన కొప్పనాతి రామకృష్ణ వర్మ బోటు యజమాని, డ్రైవర్ కుటుంబ సభ్యులను, ఆయన భార్యా పిల్లలను నాయకులు పరామర్శించారు. అలాగే బోటు కళాశీలైన కొల్లాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను, పాలేపు శాంతారావు భార్యా పిల్లలను, కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం, మత్స్యకార సంఘాలు తమకు అండగా ఉంటాయని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నడికుదుటి అర్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల ముత్యాల, మత్స్యకార పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మెరైన్ పోలీస్, నావికాదళం, కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్ల సహకారంతో సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులందరూ క్షేమంగా బయటపడి తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. వాడలరేవు మత్స్యకారులను సురక్షితంగా తీరానికి తీసుకురావడానికి మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణారావు తదితర మత్స్యకార నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. సముద్రంలో చిక్కుకున్న ప్రతి మత్స్యకారుడు క్షేమంగా తిరిగి రావాలని, వారి కుటుంబాల్లో మళ్లీ ఆనందం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 22: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన వాడలరేవు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. శనివారం వాడలరేవు మత్స్యకార గ్రామాన్ని సందర్శించిన సమాఖ్య నాయకులు బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.
సముద్రంలో చిక్కుకుపోయిన కొప్పనాతి రామకృష్ణ వర్మ బోటు యజమాని, డ్రైవర్ కుటుంబ సభ్యులను, ఆయన భార్యా పిల్లలను నాయకులు పరామర్శించారు. అలాగే బోటు కళాశీలైన కొల్లాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను, పాలేపు శాంతారావు భార్యా పిల్లలను, కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం, మత్స్యకార సంఘాలు తమకు అండగా ఉంటాయని వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నడికుదుటి అర్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల ముత్యాల, మత్స్యకార పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మెరైన్ పోలీస్, నావికాదళం, కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్ల సహకారంతో సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులందరూ క్షేమంగా బయటపడి తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. వాడలరేవు మత్స్యకారులను సురక్షితంగా తీరానికి తీసుకురావడానికి మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణారావు తదితర మత్స్యకార నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది.
సముద్రంలో చిక్కుకున్న ప్రతి మత్స్యకారుడు క్షేమంగా తిరిగి రావాలని, వారి కుటుంబాల్లో మళ్లీ ఆనందం వెల్లివిరియాలని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.