Tuesday, 22 September 2026
  • Home  
  • సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు
- రంగారెడ్డి

సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు

ఎల్బీనగర్; మన్సురాబాద్‌లో సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం 2025లో ప్రారంభించిన ఈ వేడుకలను ఈ ఏడాది రెండోసారి మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, దాండియా కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు 1,000 నుంచి 1,500 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 27న మన్సురాబాద్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలం పాట నిర్వహించడంతో పాటు, ప్రత్యేకంగా రూ.51 టికెట్‌తో 4.5 కిలోల లడ్డూ లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో సంఘం సభ్యులు సాక్షిత్, ఖుందన్ శ్రీకరణ్, భువన్ శ్రీనివేద్, కార్తిక్, అభి, కార్తిక్ గౌడ్, శరత్, సుశీల్, కళ్యాణ్, వీర్, యుగ్, వర్షిత్, రాహుల్, నాని, ప్రసాద్, మాణికంఠ, ప్రణవ్, పవన్, సుజిత్, వివేక్, వరుణ్, సాయికిరణ్, ఓం సాయి, సంపత్, నిఖిల్, ఉదయ్, సాత్విక్ తదితరులు పాల్గొంటున్నారు.

ఎల్బీనగర్; మన్సురాబాద్‌లో సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం 2025లో ప్రారంభించిన ఈ వేడుకలను ఈ ఏడాది రెండోసారి మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, దాండియా కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు 1,000 నుంచి 1,500 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ నెల 27న మన్సురాబాద్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలం పాట నిర్వహించడంతో పాటు, ప్రత్యేకంగా రూ.51 టికెట్‌తో 4.5 కిలోల లడ్డూ లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో సంఘం సభ్యులు సాక్షిత్, ఖుందన్ శ్రీకరణ్, భువన్ శ్రీనివేద్, కార్తిక్, అభి, కార్తిక్ గౌడ్, శరత్, సుశీల్, కళ్యాణ్, వీర్, యుగ్, వర్షిత్, రాహుల్, నాని, ప్రసాద్, మాణికంఠ, ప్రణవ్, పవన్, సుజిత్, వివేక్, వరుణ్, సాయికిరణ్, ఓం సాయి, సంపత్, నిఖిల్, ఉదయ్, సాత్విక్ తదితరులు పాల్గొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.