Tuesday, 22 September 2026
  • Home  
  • సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు
- రంగారెడ్డి

సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

వనస్థలిపురం: సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ రోడ్ నంబర్-10లో సెల్ఫ్ ఫైనాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ మహిళలు, చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బతుకమ్మ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉత్సవాలను సందడిగా జరుపుకుంటున్నారు. ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 22న తొమ్మిదో రోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి ప్రసిద్ధ లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అనంతరం ఇంజాపూర్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాలనీ పెద్దలు లక్ష్మీకాంత్‌తో పాటు నిర్వాహకులు సంజీవ్, శ్రీనివాస్, వెంకట్, బిట్టు, అర్చిత్ రెడ్డి, వినోద్, పునీత్, శ్రీరామ్, జగన్, కిరణ్, వేణు తదితరులు పాల్గొంటున్నారు. యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా సహకరిస్తున్నారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

వనస్థలిపురం: సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ రోడ్ నంబర్-10లో సెల్ఫ్ ఫైనాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
ప్రతిరోజూ మహిళలు, చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బతుకమ్మ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అలాగే ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉత్సవాలను సందడిగా జరుపుకుంటున్నారు. ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 22న తొమ్మిదో రోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి ప్రసిద్ధ లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అనంతరం ఇంజాపూర్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాలనీ పెద్దలు లక్ష్మీకాంత్‌తో పాటు నిర్వాహకులు సంజీవ్, శ్రీనివాస్, వెంకట్, బిట్టు, అర్చిత్ రెడ్డి, వినోద్, పునీత్, శ్రీరామ్, జగన్, కిరణ్, వేణు తదితరులు పాల్గొంటున్నారు. యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా సహకరిస్తున్నారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.